Musheer Khan : రోడ్డు ప్రమాదంలో యువ క్రికెటర్ కు గాయాలు

Musheer Khan : రోడ్డు ప్రమాదంలో యువ క్రికెటర్ కు గాయాలు
X

భారత ప్లేయర్ సర్ఫరాజ్‌ ఖాన్‌కు సోదరుడు, యువ క్రికెటర్ ముషీర్ ఖాన్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఉత్తర‌ప్రదేశ్‌లో జ‌రిగిన యాక్సిడెంట్‌లో అత‌ని మెడ‌కు గాయ‌మైన‌ట్లు సమాచారం. దీంతో అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఇరానీ ట్రోఫీలో ఆడటం అనుమానంగ మారింది. ఇరానీ క‌ప్ కోసం ల‌క్నోకు వెళ్లిన ముంబై జ‌ట్టుతో అత‌ను ట్రావెల్ చేయ‌లేదు. ఆజంఘ‌ర్ నుంచి 19 ఏళ్ల ముషీర్ తన తండ్రితో క‌లిసి వెళ్లిన‌ట్లు తెలిసింది. ఆ స‌మ‌యంలోనే ప్రమాదం జ‌రిగింది. ఇటీవల దులీప్ ట్రోఫీలో ముషీర్ భారీ శతకంతో అలరించాడు. ఫ‌స్ట్ క్లాస్ సీజ‌న్‌లో రాణిస్తున్న ముషీర్‌, గాయం వ‌ల్ల దేశవాళీ క్రికెట్‌తోపాటు ఆస్ట్రేలియాలో జ‌రిగే ఇండియా ఏ జ‌ట్టు మ్యాచ్‌ల‌కు దూరం అయ్యే అవ‌కాశం ఉంది. దులీప్ ట్రోఫీ, ఇరానీ క‌ప్ ప‌ర్ఫార్మెన్స్ ఆధారంగా ఇండియా ఏ జ‌ట్టును బీసీసీఐ ఎంపిక చేస్తుంది.

Tags

Next Story