YSRCP : శ్రీచరణికి చంద్రబాబు ప్రోత్సాహం.. వైసీపీ దరిద్రమైన రాజకీయం

YSRCP : శ్రీచరణికి చంద్రబాబు ప్రోత్సాహం.. వైసీపీ దరిద్రమైన రాజకీయం
X

క్రికెట్ వన్డే వరల్డ్ కప్ గెలిచిన వుమెన్ టీమ్ లో ఏపీకి చెందిన శ్రీచరణి ఉంది. ఆమె అద్భుతంగా బౌలింగ్ చేసింది. ఈ మహిళా క్రికెటర్లకు తమ సొంత రాష్ట్రాల్లో అద్భుత స్వాగతం లభించింది. నజరానాలు, రివార్డులు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించాయి. అయితే ఏపీకి చెందిన శ్రీచరణి విషయంపై వైసీపీ రాజకీయం స్టార్ట్ చేసింది. వేరే రాష్ట్రాలు అక్కడి ప్లేయర్లకు అవార్డులు, రివార్డులు ప్రకటిస్తే.. శ్రీచరణి రెడ్డి సామాజిక వర్గంకు చెందింది కాబట్టే చంద్రబాబు వివక్ష చూపిస్తున్నారంటూ వైసీపీ విమర్శలు చేసింది. రకరకాల ట్రోల్స్ చేశారు. వైసీపీ నేతలు తప్పులు ప్రెస్ మీట్లు పెట్టారు. కానీ చంద్రబాబు అలా అనుకోలేదు.

శ్రీచరణికి రూ.2.5 కోట్లు, గ్రూప్ 1 ఉద్యోగం, కడపలో ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇస్తామని ప్రకటించారు. శ్రీచరణిని ఎంతో ఆప్యాయంగా చంద్రబాబు, లోకేష్ మాట్లాడారు. గన్నవరం నుంచి ఉండవల్లి చంద్రబాబు ఇంటిదాకా పెద్ద ఎత్తున ర్యాలీ ద్వారా తీసుకొచ్చాయి ప్రభుత్వ వర్గాలు. ఎంతో ఆప్యాయంగా చంద్రబాబు ఆమెను స్వాగతించారు. శ్రీచరణికి విషెస్ చెప్పారు. ఫ్యూచర్ లో మరింత సాధించాలని చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే వుమెన్ టీమ్ లో కేవలం నలుగురికి మాత్రమే ఆయా రాష్ట్రాలు అవార్డులు ప్రకటించాయి. ఇందులో అందరికంటే ఎక్కువ ఏపీ ప్రభుత్వమే శ్రీ చరణికి ఎక్కువ రివార్డులు ప్రకటించింది.

ఇంకో విషయం ఏంటంటే శ్రీచరణి కోసం పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. మరి ఇప్పుడు వైసీపీ నేతలు ఏం సమాధానం చెప్తారు. శ్రీచరణి తనకు ఇది కావాలని అడగకున్నా చంద్రబాబు పిలిచి మరీ ప్రోత్సహించారు. కానీ వైసీపీ మాత్రం చివరకు క్రీడాకారుల మీద కూడా కుల రాజకీయం చేస్తోంది. ఇంత దారుణంగా వ్యవహరిస్తోంది వైసీపీ పార్టీ. అసలు వరల్డ్ కప్ గెలిచిన రెండు రోజులకే రివార్డులు ఇవ్వట్లేదని మధ్యలోకి కులాన్ని లాగేస్తోంది వైసీపీ పార్టీ. ఇంత దారుణంగా కులాల పేరుతో వైసీపీ రాజకీయం చూసి జనాలు కూడా ఛీ కొడుతున్నారు. కానీ ఆ పార్టీ నేతలు మారట్లేదు.


Tags

Next Story