Yuvraj Singh Tweets : అభిషేక్ ఇన్నింగ్సుపై యువరాజ్ ట్వీట్

భారత ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. టీ20ల్లో ఒక ఇన్నింగ్సులో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచారు. 54 బంతుల్లోనే 13 సిక్సర్లు, 7 ఫోర్లతో 135 పరుగులు చేశారు. మరోవైపు ఒకే ఇన్నింగ్సులో అత్యధిక సిక్సర్లు బాదిన ఇండియన్ ప్లేయర్‌గానూ నిలిచారు.
ఇంగ్లండ్‌పై దండయాత్ర చేసిన భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మను అతని కోచ్, మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ ప్రశంసల్లో ముంచెత్తారు. అద్భుతంగా ఆడావని కొనియాడారు. ఇదే ఆటను తాను చూడాలనుకున్నానని, గర్వంగా ఉందని ట్వీట్ చేశారు. ఈ మ్యాచులో 37 బంతుల్లో సెంచరీ చేసిన అభి, మొత్తంగా 54 బాల్స్‌లో 13 సిక్సర్లతో 135 రన్స్ చేశారు.
చివరి టీ20లో 135 పరుగులతో చెలరేగిన అభిషేక్ శర్మపై ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ప్రశంసలు కురిపించారు. తాను ఇప్పటి వరకు ఎంతో క్రికెట్ చూశానని, అయితే అభిషేక్ హిట్టింగ్ తాను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్ అని వెల్లడించారు. హోం సిరీస్‌లలో భారత్ అద్భుతమైన జట్టు అని చెప్పారు. సిరీస్ కోల్పోవడం బాధగా ఉందన్నారు. వన్డేల్లో పుంజుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com