GSAT 20 : నింగిలోకి జీశాట్ 20

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రూపొం దించిన అత్యంత అధునాతన సమాచార ఉపగ్రహం జీశాట్ 20 (జీశాట్ ఎన్ 22) నింగిలోకి దూసుకెళ్లింది. స్పేస్ఎక్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ శాటిలైట్ ను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. అమెరికాలోని ఫ్లోరిడా కేప్ కెనావెరల్ వేదికగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. 34 నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది. అనంతరం కర్నాటకలోని హసన్లో ఉన్న ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ఈ ఉపగ్రహాన్ని కంట్రోల్లోకి తీసుకోనుంది. వాణిజ్య పరంగా స్పేస్ఎక్స్, ఇస్రో మధ్య ఇదే తొలి ప్రయోగం కావడం విశేషం. 4,700 కిలోల బరువున్న ఈ శాటిలైట్ ను మన రాకెట్లు తీసుకెళ్లేందుకు సాధ్యపడకపోవడంతో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ద్వారా ఇస్రో ప్రయోగించింది. ఇది 14 ఏండ్ల పాటు సేవలు అందించనుంది. భారత్లోని మారుమూల ప్రాంతాలు, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ వంటి ద్వీపాల్లోనూ ఇంటర్నెట్ సేవలను అందించడమే దీని లక్ష్యం. జీశాట్ ఎన్2 ఉపగ్రహం ద్వారా విమానాల్లో వైఫై సేవలు మరింత విస్తృతం కానున్నాయి. ఆధునిక బ్యాండ్ ఫ్రీక్వెన్సీని మాత్రమే ఉపయోగించే ఉపగ్రహాన్ని ఇస్రో రూపొందించడం ఇదే ఫస్టం కావడం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com