ISRO Chairman : అమ్మవారి ఆలయంలో ఇస్రో చైర్మన్.. జూన్ నాటికి నాలుగు రాకెట్ ప్రయోగాలు

శ్రీహరికోట (Sriharikota) నుంచి ప్రయోగించే GSLV-F14 రాకెట్ విజయవంతం కావాలని ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ (ISRO Chairman Somnadh) ఆకాంక్షించారు. చెంగాల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాకెట్ నమూనాను అమ్మవారి పాదాల వద్ద ఉంచారు.
ఈ నాలుగు నెలల్లో మరో నాలుగు రాకెట్ ప్రయోగాలు ఉంటాయని తెలిపారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్. GSLV F14 ద్వారా INSAT -3DS ఉపగ్రహన్ని శనివారం సాయంత్రం 5.35 కి ప్రయోగిస్తున్నామని తెలిపారు. ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ సాఫీగా సాగుతోందని తెలిపారు. వాతావరణ పరిస్థితులు, తుఫాన్ లాంటి విపత్తులు, వర్షాభావ పరిస్థితులు, మేఘాల గమనాలు, సముద్ర ఉపరితల మార్పులపై స్పష్టమైన సమాచారం అందజేస్తుందన్నారు ఇస్రో చైర్మన్.
GSLV F15 ద్వారా NISSAR ఉపగ్రహ ప్రయోగం జూన్ లో ఉంటుందని ప్రకటించారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్. గతంలో అంతరిక్షంలో ఉన్న కమ్యూనికేషన్ ఉపగ్రహాలలో కొన్నింటికి కాలం చెల్లిందనీ.. వాటి స్థానంలో అత్యధిక పరిజ్ఞానం కలిగిన ఉపగ్రహాలను పంపిస్తున్నామని సోమ్ నాథ్ తెలిపారు. ఉపగ్రహం ఐదు నుంచి పది సంవత్సరాలు పనిచేస్తుందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com