ISRO PSLV C60 : ఈ రాత్రి నింగిలోకి ఇస్రో పీఎస్ఎల్‌వీ సీ60

ISRO PSLV C60 : ఈ రాత్రి నింగిలోకి ఇస్రో పీఎస్ఎల్‌వీ సీ60
X

నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ60 రాకెట్‌ ప్రయోగం జరుగనుంది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ60ని ప్రయోగించడానికి శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లూ చేశారు. ఆదివారం రాత్రి 8:58 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం కాగా సోమవారం రాత్రి 9:58 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. పీఎస్‌ఎల్‌వీ-సీ60 ద్వారా ప్రధానంగా స్పేడెక్స్‌ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు మరో 24 పేలోడ్‌లనూ అంతరిక్షంలోకి పంపించి ప్రయోగాలు నిర్వహించడానికి శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు. పలు విద్యాసంస్థలు, స్టార్టప్స్, ఇస్రో అనుబంధ సంస్థలు తయారుచేసిన ఈ పేలోడ్‌లను శాస్త్రవేత్తలు రాకెట్‌ నాలుగో స్టేజ్‌ పైభాగంలో అమర్చారు. పీఎస్‌4-ఆర్బిటల్‌ ఎక్స్‌పెరిమెంట్‌ మాడ్యూల్‌ గా వ్యవహరించే ఈ భాగం కొన్నివారాల్లో భూమిపై పడిపోతుంది. ఈ వ్యవధిలోనే అందులోని పేలోడ్‌లు నిర్దిష్ట ప్రయోగాలు చేపట్టేలా ఇస్రో ఈ విధానాన్ని రూపొందించింది.

Tags

Next Story