TS : మల్కాజిగిరిలో 11 నామినేషన్లు

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో సోమవారం 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతం తెలిపారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ(కాంగ్రెస్) నుంచి పట్నం సునీతారెడ్డి రెండు సెట్ల నామినేషన్లు, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, రాష్ట్ర సామాన్య ప్రజాపార్టీ అభ్యర్థిగా అప్పారావు ఒక నామినేషన్, స్వతంత్ర అభ్యర్థులుగా అంతోని డేవిడ్, పాలది పవన్‌కుమార్, పెండ్యాల శేషసాయి వరప్రసాద్, కంటే సాయన్న, బేగారి లోకేష్, భారత సుదర్శన్, మహమ్మద్ అక్బర్‌తో కలిపి మొత్తం 11 నామినేషన్లు వేశారు.
ఉప ఎన్నిక జరుగుతోన్న కంటోన్మెంట్ శాసనసభా స్థానం నుంచి సోమవారం తొమ్మిది మంది నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ నారాయణ్ నామినేషన్ వేయగా.. బీఆర్‌ఎస్ అభ్యర్థి నివేదిత తరపున ఆ పార్టీ నాయకుడు ఓ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ నేత ఏంఎ శ్రీనివాస్, బహుజన ముక్తి పార్టీ నుంచి ఉప్పులేటి రాజేందర్‌తోపాటు ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com