Cigarettes : రూ.12లక్షల విలువైన సిగరెట్ల చోరీ

కేయూ పోలీస్‌స్టేషన్ పరిధిలో రూ.12లక్షల విలువ కలిగిన (8 కాటన్స్) సిగరెట్స్ చోరీ జరిగింది. కాకతీయ యూనివర్సిటీ రెండో గేటు ముందు ఉన్న వంశీ ఏజెన్సీ గోడౌన్ తాళాలు పగులగొట్టి సిగరెట్లు అపహరించుకువెళ్లారు. లోక్‌సభ ఎన్నికల సందర్బంగా సోమవారం గోడౌన్‌కు రాని యజమాని.. మంగళవారం ఉదయం వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా సిగరెట్ కాటన్స్ కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంగళవారం ఏజెన్సీ యజమాని హరీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
ఓటు వేసేందుకు వెళ్లిన రవినాయక్ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగిన సంఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. స్టేషన్ పరిధిలోని భద్రకాళినగర్‌లో నివాసం ఉంటున్న రవినాయక్ ఓటు వేసేందుకు సోమవారం స్వగ్రామం వెళ్లారు. మంగళవారం వచ్చి చూడగా తాళాలు పగులగొట్టి ఉండటం గమనించి లోనికి వెళ్లి చూశాడు. ఇంట్లోని రూ.2లక్షల విలువైన స్టీల్ వస్తువులు అపహరణకు గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com