Drug Smuggling Case : డ్రగ్స్ కేసులో టాంజానియా యువతికి 12 ఏళ్ల జైలు శిక్ష

డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో విదేశీ యువతికి రంగారెడ్డి జిల్లా కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. టాంజానియా దేశానికి చెందిన ఓ యువతిపై డ్రగ్స్ కేసు రుజువు కావడంతో ఏకంగా 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
2021లో టాంజానియాకి చెందిన ఓ యువతి ఆ దేశం నుండి మూడు కిలోల హెరాయిన్ హైదరాబాద్ కు తీసుకు వచ్చింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన ఆ యువతి ప్రవర్తనపై అనుమానం వచ్చిన డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేశారు. యువతి వద్ద నుండి మూడు కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.
సీజ్ చేసిన హెరాయిన్ విలువ దాదాపు రూ.19 కోట్ల ఉంటుందని డీఆర్ఎస్ఐ అధికారులు వెల్లడించారు. హెరాయిన్ స్మగ్లింగ్ చేసిన యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి కీలక ఆధారాలను కోర్టుకు సకాలంలో సమర్పించారు. రంగారెడ్డి జిల్లా కోర్టు టాంజానియా దేశానికి చెందిన యువతికి 12 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com