TS : తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరిలో 525 మంది

లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల విత్ డ్రా గడువు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 625 మంది నామపత్రాలు సమర్పించగా.. 100 మంది విత్ డ్రా చేసుకున్నారు. దీంతో ఎన్నికల బరిలో 525 మంది నిలిచారని అధికారులు తెలిపారు. ఇక అత్యధికంగా సికింద్రాబాద్ స్థానం నుంచి 45 మంది, మెదక్ నుంచి 44 మంది బరిలో ఉన్నట్లు తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ క్యాండిడేట్లు ముహూర్తాలు చూసుకుని నామినేషన్లు వేశారు. ఏప్రిల్ 25 తేదీ వరకు 839 మంది నామినేషన్లు వేయగా.. 26న నామినేషన్ల పరిశీలన పూర్తయింది. స్క్రూటినీ తర్వాత 268 మంది క్యాండిడేట్ల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇందులో ఎక్కువగా ఇండిపెండెంట్క్యాండిడేట్లు ఉన్నారు.
మందా జగన్నాథంకు బీఎస్పీ బీ ఫామ్ ఇవ్వకపోవడంతో.. ఆయన నాగర్కర్నూల్స్థానంలో వేసిన నామినేషన్ రిజెక్ట్ అయ్యింది. ప్రజాశాంతి పార్టీ నుంచి బాబుమోహన్ వరంగల్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేయగా.. స్క్రూటినీలో తిరస్కరణకు గురయ్యింది. వచ్చే నెల 13వ తేదీన పోలింగ్ జరుగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com