Road Accident : హయత్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. మూడు కుటుంబాల్లో విషాదం

Road Accident : హయత్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. మూడు కుటుంబాల్లో విషాదం
X

హైదరాబాద్ లోని హయత్ నగర్ కుంట్లూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పసుమాముల నుంచి కుంట్లూర్ వెళ్తున్న డీసీఎంను వేగంగా వచ్చిన కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కుంట్లూర్ గ్రామానికి చెందిన చంద్రసేనారెడ్డి, త్రినాద్ రెడ్డి, వర్షిత్ రెడ్డిలు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రాత్రి పెద్ద అంబర్ పేట్‌లోని ఒక ఫంక్షన్‌కి వెళ్ళి ఉదయం కుంట్లూర్‌లోని తమ నివాసాలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. చనిపోయిన ముగ్గురు వారి కుటుంబంలో ఒక్కొక్క అబ్బాయిలు కావడంతో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలో ఉన్న పెట్రోల్ పంపులోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story