Ts : చైల్డ్ డెవలప్మెంట్ అధికారిణి అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్

ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించిన హైదరాబాద్ చైల్డ్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అధికారి (Hyderabad Child Development Project Officer) అనిశెట్టి శ్రీదేవిని (Anishetti Sridevi) ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనూర్ సీడీపీఓగా శ్రీదేవి గతంలో పనిచేసిన సమయంలో రూ. 65.78 లక్షల ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేసినట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది.
దీంతో విచారణ చేపట్టిన అధికారులు ఆరోగ్యలక్ష్మి పాల సరఫరా ఖర్చులలో జరిగిన అవినీతితో పాటు అవకతవక జరిగినట్లు తేలడంతో ఆమెపై కేసు నమోదు చేశారు. ఆరోగ్యలక్ష్మీ పాల సరఫరాలో నకిలీ ఇండెంట్లు సృష్టించి నగదు కాజేసినట్లు ఏసీబీ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు.
ఈక్రమంలో 2015, 2016 సంవత్సరాలలో జైనూర్ సీపీడీఓ శ్రీదేవి దాదాపు 332 అంగన్వాడీ కేంద్రాల నిధులను దుర్వినియోగం చేశారని, వెరసి మొత్తం రూ. 65.78 లక్షల దారి మళ్లించినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ చైల్డ్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అధికారిగా పనిచేస్తున్న అమెను అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఏసీబీ కోర్టు నిందితురాలికి 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com