TG : కొత్త చట్టాల ప్రకారం.. నంబర్ ప్లేట్ లేదని తొలికేసు నమోదు
రాష్ట్రంలో కొత్తచట్టాల కింద చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొలి కేసు నమోదైంది. నంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుడిపై కొత్త చట్టంకింద కేసు నమోదు చేశారు. సెక్షన్ 281 బీఎన్ఎస్, ఎంవీ యాక్ట్ కింద పోలీసులు ఎఫ్ఐఆర్ ను డిజిటల్ గా నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చార్మినార్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు వెళుతున్న నంబర్ ప్లేట్ ని వాహనాన్ని గుర్తించారు. వాహనంపై వెళుతున్న వారిలో ఒకరు గిల్ వర్కర్ కాగా మరొకరు హోటల్ వర్కర్ గా పోలీసులు గుర్తించారు. వీరికి బీఎన్ఎస్ చట్టం కింద నోటీసులు జారీ చేశామని తెలిపారు. సైబరాబాద్ పరిధిలోని జగద్గిరిగుట్టలో 194 సెక్షన్ కింద
రాష్ట్రంలో కొత్తచట్టాల కింద.. రెండు ఆత్మహత్యల కేసులు నమోదు చేశారు. ఈ కేసులో గతంలో 174 సెక్షన్ పరిధిలోకి వచ్చేవని పోలీసులు తెలిపారు.
భారత న్యాయ వ్యవస్థలో కొత్త చాప్టర్ మొదలైంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్(బీఎస్ఏ) అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ న్యాయ సంహిత కింద తెలంగాణలో తొలి కేసు కొత్త చట్టాల ప్రకారం సెక్షన్ 281 భారతీయ న్యాయ సంహిత, ఎంవీ యాక్ట్ కింద ఎఫ్ఎస్ఐఆర్ ను డిజిటల్ నమోదు చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com