TS : బీర్ల కొరత తీర్చడం బాధ్యతగా తీసుకుంటాం : జూపల్లి

తెలంగాణలో వివిధ కారణాల వల్ల బీర్ల కొరత ఏర్పడినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. దీన్ని తీర్చడం బాధ్యతగా తీసుకుంటున్నామన్నారు. అటు నిబంధనల మేరకే సోం డిస్టిలరీస్‌కు బేవరేజెస్ కార్పొరేషన్ అనుమతి ఇచ్చిందని తెలిపారు. డిమాండ్-సరఫరా మేరకు కొత్త కంపెనీలకు ఈ కార్పొరేషన్ అనుమతి ఇస్తుందని పేర్కొన్నారు. సోమ్ డిస్టిలరీస్ 20 ఏళ్లుగా 22 రాష్ట్రాల్లో మద్యం సరఫరా చేస్తోందన్నారు.
కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి తమ దగ్గరకు ఎలాంటి దరఖాస్తులు రాలేదని, గతంలో చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో హోల్‌సేల్ మద్యం బ్రాండ్లకు అనుమతి విషయంలో సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం బేవరేజెస్ కార్పొరేషన్‌కు ఉంటుందన్నారు జూపల్లి. రాష్ట్రంలో హోల్‌సేల్ మద్యం సరఫరాకు కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చే ప్రక్రియ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుందని మంత్రి జూపల్లి తెలిపారు.
డిమాండ్ అండ్ సప్లైని బట్టి కొత్త కంపనీలకు అనుమతులు మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. రెండు దశాబ్దాలుగా సోమ్ డిస్టిలరీస్ తమ ఉత్పత్తులను విక్రయిస్తుందని, దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని IMFL సరఫరాదారుగా ఉందని చెప్పారు. ఇప్పటికే ఉన్న ఎక్సైజ్ పాలసీ ప్రకారమే సామ్ డిస్టిలరీస్‌తో పాటు ఇతర కంపెనీలకు మద్యం సరఫరాకు బెవరేజ్ కార్పోరేషన్ లిమిటెడ్ అనుమతులిచ్చారని తెలిపారు. ఎక్కడా కూడా నిబంధనల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com