TS : మధ్యాహ్నం వాన.. రాత్రి మంచు

TS : మధ్యాహ్నం వాన.. రాత్రి మంచు
X

సమ్మర్ ఆరంభంలోనే ప్రతాపం చూపించింది. ఒకట్రెండు రోజులుగా మాత్రం కొంచెం రిలీఫ్ ఇస్తోంది. వాతావరణంలో మార్పులతోనే టెంపరేచర్ తగ్గిందంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఎండలతో సతమతం అవుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది.

రాష్ట్రంలో రాబోయే మూడ్రోజుల పాటు ఎండల తీవ్రత తగ్గనున్నట్లు చెప్పింది. దాంతో.. ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో దంచికొడుతున్న ఎండలు కాస్త తగ్గుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఆదివారం, సోమవారం, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురస్తాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది.

ఎండల వేడిమితో హైదరాబాద్‌ (Hyderabad) ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో.. నగరంలో కూడా ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 18వ తేదీ వరకు ఉదయం వేళల్లో నగరంలో పొగమంచు కమ్ముకునే అవకాశాలు ఉన్నాయని వివరించింది. నిర్మల్, హైదరాబాద్‌ ప్రాంతాల్లో టెంపరేచర్ 40 దాటింది. ఐతే.. వెదర్ అలర్ట్ తో కొంత ఉపశమనం దక్కినట్టయింది.

Tags

Next Story