Alert for Inter Students : ఇంటర్ ఫెయిలైన విద్యార్ధులకు అలెర్ట్

తెలంగాణ ఇంటర్ ఫలితాలు నిన్న వెలువడ్డాయి. ఇంటర్, సెకండియర్‌లో ఫెయిలైన విద్యార్థులకు మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబడతాయి. ఫస్టియర్‌కు ఉ.9 నుంచి మ.12 వరకు, సెకండియర్‌కు మ.2.30 నుంచి సా.5.30 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఈ పరీక్షల ఫీజును నేటి నుంచి మే 2 వరకు కాలేజీల్లో చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.600 చెల్లించాలి. దీనికి కూడా మే 2 వరకు ఛాన్స్ ఉంది.
ఇంటర్ ఫలితాల్లో ఫెయిలయ్యమనే మనస్తాపంతో నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో చిప్ప భార్గవి ఉరివేసుకోగా.. యశస్విని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ మెహిదీపట్నంలో హర్షిణి, పఠాన్‌చెరుకు చెందిన సాయితేజ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగలకుండా ఉండాలని సూచిస్తున్నారు.
పరీక్షల్లో ఫెయిలయ్యామని విద్యార్థుల ఆత్మహత్యలకు.. కలవరపెడుతోంది. పిల్లలకు అండగా తల్లిదండ్రులే ఉండాలి. వారికి స్ఫూర్తినిచ్చే నిజజీవిత కథను నటుడు అనుపమ్ ఖేర్ గతంలో చెప్పారు. ‘మా క్లాసులో 60 మంది ఉంటే నాకు 59వ ర్యాంక్ వచ్చింది. నాన్న కోప్పడలేదు. నువ్వు కష్టపడితే ముందుకెళ్లొచ్చు.. ఫస్ట్ ర్యాంకర్ తన స్థానం పోతుందేమోనని భయపడుతూ ఉంటాడు. మార్కులు జీవితాన్ని నిర్ణయించలేవని చెప్పాడు’ అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com