TS Inter Fail Students Alert : ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్.. ఇవ్వాలే లాస్ట్ డేట్

ఇంటర్ పరీక్షలలో ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించేందుకు గడువు నేటితో ముగియనుంది. విద్యార్థులు తమ కాలేజీలోనే ఫీజు చెల్లించాలని అధికారులు సూచించారు. మరోవైపు ప్రిన్సిపల్స్ ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు గడువు రేపటి వరకు ఉంది. కాగా ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఈయర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు సెకండ్ ఈయర్ ఎగ్జామ్ ఉంటాయి. సప్లిమెంటరీ పరీక్షల కోసం ఇంటర్మీడియట్ విద్యార్థులు పేపర్లతో సంబంధం లేకుండా రూ.460 పరీక్ష పీజు, ప్రాక్టికల్స్‌కు రూ.170, బ్రిడ్జి కోర్సులకు రూ.120 లు చెల్లించాల్సి ఉంటుంది.
ఇంప్రూవ్‌మెంట్ ఎగ్జామ్స్ స్టూడెంట్స్ పరీక్ష ఫీజుతో పాటు ఒక్కో పేపర్‌కు రూ.160 చొప్పున చెల్లించాలి. మొదటి, రెండో సంవత్సరం ఇంప్రూవ్‌మెంట్ రాయాలనుకుంటే.. సైన్స్ విద్యార్థులు రూ.1200, ఆర్ట్స్ విద్యార్థులు రూ.1050 చెల్లించాల్సి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com