Fish Medicine : చేప మందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి

మృగశిర కార్తె సందర్భంగా ప్రతియేటా ఉబ్బసం రోగులకు బత్తిని సోదరులు అందించే చేప మందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మెన్ మెట్టు సాయి కుమార్ అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. రేపు ఉదయం ఈ పంపిణీ కార్యక్రమాన్ని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారన్నారు.
గత ఏడాది కంటే , ఈ ఏడాది చేప మందు తీసుకొనేందుకు ప్రజలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని... అందుకోసం ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుండి 1 లక్ష 60 వేల చేప పిల్లలను అందుబాటులో ఉంచమన్నారు. దూరప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన ఆస్తమా రోగులకు బసవ కేంద్ర చార్కామన్ సంఘం భోజన ఏర్పాట్లను చేసింది.
రెండు రోజుల పాటు ఎంత మంది వచ్చిన వారికి బోనజాన్ని అందిస్తామని సంఘం అధ్యక్షుడు నాగ్ నాత్ మశాట్టే తెలిపారు. రేపటి చేప మందు పంపిణీ కు టోకెన్ లను ఈరోజు నుండే విక్రయిస్తుండటంతో , చాలా మంది ఇప్పటికే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు చేరుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com