TS : నేడు తెలంగాణకు అమిత్ షా.. సిద్దిపేటలో సభ

లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ అగ్రనేతలు తెలంగాణకురానున్నారు. ఇవాళ సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ విజయ సంకల్ప బహిరంగ సభలో పాల్గొంటారు. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘానందరావుకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు సభ జరగనుంది. ఆ తర్వాత 1.45 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని రెండున్నర గంటలపాటు అక్కడే ఉంటారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నేతలతో సమావేశం నిర్వహించి ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 4.15 గంటలకు భువనేశ్వర్‌కు బయలుదేరుతారు.
మరోవైపు ప్రధాని మోదీ ఈనెల 30న జహీరాబాద్, మెదక్ లోక్‌సభ స్థానాలకు కలిపి సుల్తాన్‌పూర్‌లో నిర్వహించే సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మే 3న చౌటుప్పల్, 4న నారాయణపేట, వికారాబాద్ లేదా మరో ప్రాంతంలో జరిగే సభలో పాల్గొంటారు. తర్వాత కూడా మరో 2-3 రోజులు ప్రచారం నిర్వహిస్తారని సమాచారం.
ప్రధాని మోదీ ఏపీలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. మే 3, 4 తేదీల్లో మోదీ ఏపీకి వస్తున్నట్లు బీజేపీ హైకమాండ్ తెలిపింది. ఈ రెండు రోజుల పర్యటన కోసం రోడ్ షోలు, సభా వేదికలను నేతలు ఖరారు చేయనున్నారు. బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా మోదీ ప్రచారం నిర్వహించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com