TS : మార్చి 4న తెలంగాణకు అమిత్ షా

TS : మార్చి 4న తెలంగాణకు అమిత్ షా

కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా (Amit Shah) మార్చి 4న తెలంగాణకు (Telangana) రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బీజేపీ (BJP) చేపట్టిన విజయ సంకల్ప యాత్ర ముగింపు బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ వాస్తవానికి నెల 24 ననే అమిత్ షా తెలంగాణ పర్యటనకు రావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఆయన రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మార్చి 4న ఆయన తెలంగాణకు రానున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 10 ఎంపీ సీట్లకు పైగా గెలుచుకోవాలన్న లక్ష్యంతో టీ. బీజేపీ విజయ సంకల్ప యాత్రలను నిర్వహిస్తోంది.

ఈ నెల 16న కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విజయ సంకల్ప యాత్రలను ప్రారంభించారు. అయిదు క్లస్టర్లుగా రాష్ట్ర వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రలు కొనసాగుతున్నాయి. యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్ లో భారీ బహిరంగసభను బీజేపీ నిర్వహించబోతోంది. ఈ ముగింపు బహిరంగసభకు బీజేపీ అగ్రనేత అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

రాష్ట్ర పర్యటన సందర్భంగా బీజేపీ ముఖ్యనేతలతో అమిత్ షా కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటివరకు అనుసరిస్తున్న కార్యచరణ, ప్రజల్లో పార్టీపై నెలకొన్న అభిప్రాయం, ప్రజల మనుసులను గెలుచుకుని, ఓట్ల రూపంలో లబ్దిపొందాలంటే అనుసరించాల్సిన వ్యూహాత్మక కార్యచరణపై రాష్ట్ర కార్యవర్గానికి ఆయన కీలక సూచనలు చేసే అవకాశం ఉంది.

Tags

Next Story