Amit Shah : ఇవాళ హైదరాబాద్ కు అమిత్ షా

నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) రాష్ట్రానికి రానున్నారు. మధ్యాహ్నం 1:20 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట (Begumpet) ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ముందుగా బీజేపీ సోషల్ మీడియా వారియర్స్‌తో, ఆ తర్వాత బూత్ అధ్యక్షులతో భేటీ అవుతారు. అనంతరం పార్లమెంట్ కన్వీనర్లు, జాతీయ కార్యవర్గ సభ్యులతో సమావేశమై ఎన్నికల వ్యూహాలు, ప్రచారంపై మార్గనిర్దేశం చేస్తారు. సాయంత్రం 6:10 గంటలకు బేగంపేట నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్తారు.
తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా 32 వేల పోలింగ్ బూత్‌లు ఉండడంతో ఈ బూత్ కమిటీల అధ్యక్షులు, ఇన్‌చార్జిలు, ఇతరనాయకులు.. మొత్తం దాదాపు 50-60 వేల మంది వరకు ఈ సమ్మేళనానికి హాజరవుతారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బూత్ ఏజెంట్లతో నిర్వహించే విజయ సంకల్ప సమ్మేళనం ముగిసిన తర్వాత సాయంత్రం 4:45 నుంచి 5:45 వరకు ఐటీసీ కాకతీయ హోటల్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం, నాయకుల మధ్య మరింత మెరుగైన సమన్వయంపై అమిత్ షా స్పష్టమైన ఆదేశాలు ఇస్తారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com