Fire Incident : హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం... ప్లాస్టిక్ కంపెనీలో మంటలు..

Fire Incident :    హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం... ప్లాస్టిక్ కంపెనీలో మంటలు..
X

హైదరాబాద్ లోని పలు ప్రైవేట్ కంపెనీ లలో జరుగుతున్న వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సరైన భద్రత ప్రమాణాలు పాటించకుండా ఉద్యోగుల ప్రాణాలతో చలగాటమాడుతున్నాయి కంపెనీ యాజమాన్యాలు. ఇటీవలే జరిగిన సిగాచి పరిశ్రమ అగ్నిప్రమాదం లో భారీగా ప్రాణ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు ఉదయం మరో ప్లాస్టిక్ పరిశ్రమ లో అగ్ని ప్రమాదం జరిగింది.

వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని బాలాపూర్ లో ఉన్న ఓ ప్లాస్టిక్ పరిశ్రమ లో ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. ఐతే ఘటన జరిగినపుడు కంపెనీలో ఎవ్వరూ లేకపోవడం తో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. ఏది ఏమైనప్పటికీ వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలతో కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. భయం గుప్పిట్లో పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని భద్రత ప్రమాణాలు పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

Tags

Next Story