TS : తెలంగాణలో మరో నామినేటెడ్ పోస్ట్ చైర్మన్ రాజీనామా

తెలంగాణలో మరో కీలక వికెట్ పడింది. టెస్కాబ్ ఛైర్మన్ పదవికి కొండూరి రవీందర్ రావు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన అనంతరం రవీందర్‌రావు మీడియాతో మాట్లాడారు. సహకార సంఘంలోని కొంత మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల తాను పదవిలో కొనసాగలేనని చెప్పుకొచ్చారు.
సహకార సంఘంలో కొంత మంది ఇప్పుటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారని.. ఇంకా ఈ పదవిలో కొనసాగలేనని.. అందుకే రాజీనామా చేస్తున్నానని ఆయన వెల్లడించారు. “2015లో రాష్ట్ర సహకార బ్యాంకు ఆవిర్భావం జరిగింది. రాష్ట్ర సహకార బ్యాంకులో డైరెక్టర్లు పార్టీ మారారు. విశ్వాసం కోల్పోయిన చోట వుండవద్దని నేను నిర్ణయం తీసుకున్నాను. ఛైర్మన్‌గా నేను, వైస్ చైర్మన్ మహేందర్ రెడ్డి పదవులకు రాజీనామా చేస్తున్నాం. గత తొమ్మిది సంవత్సరాలుగా సహకార వ్యవస్థలో ప్రగతి జరిగింది. రాష్ట్ర సహకార బ్యాంకు అధ్యక్షుడుగా నేను తొమ్మిది సంవత్సరాలుగా వున్నాను" అని చెప్పారు రవీందర్ రావు.
తెలంగాణ సహకార వ్యవస్థను అన్ని రాష్ట్రాలు అనుసరించాలని నీతి ఆయోగ్ చెప్పిన సంగతి గుర్తుచేశారు రవీందర్ రావు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com