TS : కేసీఆర్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరిన గుత్తా అమిత్

కొద్దిరోజులుగా వస్తున్న ఊహాగానాలు నిజమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇంఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ సమక్షంలో హైదరాబాద్ లో గుత్తా అమిత్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత కొంతకాలంగా అమిత్ పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. నల్గొండ, భువనగిరి ఎంపీ టికెట్ దక్కకపోవడంతో సైలెంట్ అయినపోయిన గుత్తా వర్గం.. ఎన్నికలకు సరిగ్గా 15రోజుల ముందు పార్టీ మారింది.
గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీ మారతారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఆయన మాత్రం అలాంటిదేం లేదని కొట్టిపారేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన కుమారుడు కాంగ్రెస్ పార్టీని వీడటంతో గుత్తా సుఖేందర్ కూడా కారు దిగడం ఖాయమనే మాట వినిపిస్తోంది. గుత్తా చేరుతారా లేదా.. చేరకపోతే ఆయన వ్యూహం ఏంటి.. అనేది తేలాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com