Chandrababu : తెలంగాణ పై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్?

తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఇకపై టీటీడీపీ నేతలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. నేడు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. తెలంగాణలో టీడీపీ బలోపేతానికి తీసుకోవాల్పిన... చర్యలపై నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు. తెలంగాణలోని పార్టీ కార్యకర్తలతోనూ చంద్ర బాబు సమావేశం కాను న్నారు. ఏపీలో అధికారం చేపట్టాక.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వచ్చిన చంద్ర బాబు.. ఇక్కడి నేతలతో నూ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. టీడీపీకి పూర్వవైభవం కోసం.. పార్టీ అధ్యక్షుడు, సభ్యత్వ నమోదుపై చర్చిం చారు. నిన్నటి సమావేశం లో.. పొలిట్‌బ్యూరో కూడా తెలంగాణలో పార్టీ బలోపే తానికి మొగ్గు చూపడంతో.. త్వరలోనే ఇందుకు సంబంధించిన కార్యచరణ సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com