TS : నవనీత్ కౌర్ వ్యాఖ్యలపై అసదుద్దీన్ కౌంటర్

TS : నవనీత్ కౌర్ వ్యాఖ్యలపై అసదుద్దీన్ కౌంటర్
X

పోలీసులు 15 నిమిషాలు పక్కకు జరిగితే తామేం చేయగలమో చూపిస్తామని అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ చేసిన కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్‌లో మరోసారి దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గా నవనీత్ కౌర్ మాట్లాడుతూ.. మాకు 15 సెకన్లు చాలు.. సోదరులిద్దరూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు అన్నది ఎవరికీ తెలియదు అని ఘాటుగా మాట్లాడారు.

గురువారం ఈ వ్యాఖ్యలపై ఏఐఎంఐం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. 15 సెకన్లు కాదు గంట సమయం తీసుకోండి.. ముస్లింలను ఏం చేస్తారో చేయండని ఎంఐఎం చీఫ్ అన్నారు. అధికారమంతా మీ దగ్గరే ఉంది.. ఎక్కడికి రమ్మంటే తాము అక్కడికి వస్తామన్నారు.

ప్రస్తుతం నవనీత్ కౌర్, అసదుద్దీన్ ఒవైసీ మధ్య డైలాగ్ వార్ సంచలనంగా మారింది

Tags

Next Story