TS : కేఏ పాల్ పార్టీలో లేను.. బాబూమోహన్ హాట్ కామెంట్

సినీ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గురువారం రోజున నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం వరంగల్ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్న ఆయన నడుము నొప్పితో బాధపడుతూ కనిపించారు. సిబ్బంది వీల్ ఛైర్ లో లోనికి పంపారు.
రిటర్నింగ్ అధికారికి బాబు మోహన్ నామినేషన్ పత్రాలు అందజేశారు. బయటకు వచ్చిన బాబు మోహన్ను మీడియా ప్రతినిధులు.. కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ నుంచి నామినేషన్ వేస్తారనే ప్రచారం జరిగిందని ప్రశ్నించారు.
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లానని, అక్కడ పాల్ తనకు కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారని చెప్పారు. అయితే తాను దానికి ఒప్పుకోలేదని, తాను ఎలాంటి పార్టీ సభ్యత్వం తీసుకోలేదని స్పష్టం చేశారు. అదే రోజు ఆ పార్టీకి టాటా బైబై చెప్పానని అసలు సంగతి చెప్పుకొచ్చారు. వరంగల్‌లో కొందరు అభిమానులు అడగడం వల్లే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశానన్నారు బాబూమోహన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com