Abhishek Boinapally : లిక్కర్ స్కామ్ కేసులో.. అభిషేక్ బోయినపల్లికి బెయిల్

లిక్కర్ స్కామ్ కేసులో (Liquor Scam Case) నిందితుడిగా ఉన్న బోయినపల్లి అభిషేక్ (Boinapally Abhishek) బోయినపల్లికి ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అభిషేక్ భార్య అనారోగ్యంతో ఉందన్న కారణంగా నాలుగు వారాల బెయిల్ ను మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. పాస్ పోర్టును సరెండర్ చేసి.. హైదరాబాద్ లో చికిత్స చేయించేందుకు పర్మిషన్ ఇచ్చింది.
ఈడీ అధికారులకు ఒక మొబైల్ నెంబర్ ఇవ్వా లని కండీషన్ పెట్టింది. అలాగే మిగిలిన బెయిల్ నిబంధనలను ట్రయల్ కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంటుందని తెలిపింది. అనంతరం ఈ పిటిషన్ పై తదుపరి విచార ణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది.
ఈడీ కేసుల్లో ట్రయల్స్ జాప్యంపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. లిక్కర్ స్కామ్‌లో 2022 అక్టోబర్‌లో అభిషేక్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీకి చెందిన మంత్రిని అరెస్ట్ చేసి జైలుకు పంపగా, ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత ఈ కేసులో ఈడీ అధికారులో కస్టడిలో విచారణను ఎదుర్కోంటున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com