Bandi Sanjay : మానవత్వాన్ని చాటుకున్న బండి సంజయ్

Bandi Sanjay : మానవత్వాన్ని చాటుకున్న బండి సంజయ్
X

లారీ కింద ఇరుక్కుని ప్రాణా పాయ స్థితిలో ఉన్న యువతిని కాపాడే ప్ర యత్నం చేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ మానవత్వాన్ని చాటుకున్నారు. కరీంన గర్ జిల్లా హుజురాబాద్ సింగాపూరం సమీపంలో ఓ యువతి రోడ్డు ప్రమాదానికి గురై లారీ కింద ఇరుక్కుపోయింది. అదే టైంలో ములుగు పర్యటనకు వెళ్తున్న బండి సంజయ్ ఈ ప్రమాదాన్ని గుర్తించి హుటాహుటిన తన వాహనాన్ని ఆపించి ఆ యువతిని కాపాడేందుకు స్థానికులతో సహా సహాయక చర్యలు చేపట్టారు. లారీ టైర్ కింద ఆమె జుట్టు ఇరుక్కోవడంతో వాటిని కత్తిరించి యువతిని బయటకు తీశారు. గాయాలపాలైన యువతిని కరీం నగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి పంపి.. చికిత్సకు అయ్యే ఖర్చును తానే భరిస్తా నని మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని హాస్పిటల్ డాక్టర్లకు చెప్పారు. బాధితురా లు మానకొండూర్ మండలం ఖెల్లడ గ్రా మానికి చెందిన దివ్య శ్రీగా గుర్తించారు. ఇద్దరు పిల్లలు, భర్తతో సహా బైక్ పై వెళ్తు న్న క్రమంలోకంట్రోల్ తప్పి లారీ కింద పడటంతో ఈ ప్రమాదం జరిగిన్నట్లుగా తెలుస్తోంది.

Tags

Next Story