TS : సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ

TS : సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ
X

కాళేశ్వరం మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగకుండా అటకెక్కించే కుట్రలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. సీఎం రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో కీలక అంశాలపై అనుమానాలు లేవనెత్తారు. ఈ రెండు అంశాలపై విచారణ జరిగితే కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని బండి సంజయ్ అన్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరగకుండా ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయని.. భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తమ ద్రుష్టికి వచ్చిందని సంజయ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కారకులు కేసీఆర్, కేటీఆర్ లకు నోటీసులిచ్చి విచారిస్తే రాష్ట్ర దర్యాప్తు సంస్థల విశ్వసనీయత పెరిగేదని అభిప్రాయపడ్డారు.

ఆ పని చేయకపోవడంవల్లే సీబీఐ విచారణ కోరుతున్నామనీ.. ఫోన్ ట్యాపింగ్ అత్యంత తీవ్రమైన నేరమని చెప్పారు సంజయ్. భార్యాభర్తలు మాట్లాడుకునే అంశాలను కూడా ట్యాపింగ్ చేసి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారనీ.. ఫోన్ ట్యాపింగ్ తో వ్యాపారులు, బిల్డర్లు, పారిశ్రామికవేత్తలుసహా పలువురు సెలబ్రిటీలను బెదిరించి డబ్బులు వసూలు చేయడంతోపాటు తమ అవసరాలను తీర్చుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వమే స్పందించి సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాయాలని కోరారు సంజయ్.

Tags

Next Story