TS : రాష్ట్ర చిహ్నం, గేయం విమర్శలపై బెల్లయ్య నాయక్ స్ట్రాంగ్ కౌంటర్

TS : రాష్ట్ర చిహ్నం, గేయం విమర్శలపై బెల్లయ్య నాయక్ స్ట్రాంగ్ కౌంటర్
X

తెలంగాణ రాష్ట్ర గీతంపై మాజీ సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, ప్రకాష్ కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నట్టు చేస్తున్నారని ఫైరయ్యారు టీపీసీసీ ఆదివాసీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్. తెలంగాణ గేయాన్ని, పదేండ్లుగా తటస్థం చేస్తే, కాంగ్రెస్ వచ్చాక, సీఎం రేవంత్ రెడ్డి అందే శ్రీ ని పిలిచి, మాట్లాడి డిక్లేర్ చేసి ప్రజల ఉద్యమ కారుల అభిప్రాయాలను అందించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

1996 నుండి ఉద్యమంలో ఉన్నానని.. వీళ్లెవరూ తనకు కనిపించలేదని అన్నారు. వీళ్లు తెలంగాణ వచ్చాక కేసీఆర్ దగ్గర చేరారనీ..

చరిత్ర లో నిలిచిపోయే స్థాయి కి తీసుకుపోయే విధంగా, హై పిచ్ వాళ్లు పాడితే బావుంటది అని కావలిసిన మ్యూజిక్ కూడా అదే స్థాయి లో ఉండాలనీ.. కీరవాణి లాంటి అగ్రశ్రేణి వాళ్లతో చేయించారని చెబుతున్నారు.

దమ్ముంటే దేశపతి, ప్రకాశ్ ప్రైవేట్ డిస్కషన్ రికార్డ్ చేసి విడుదల చేయాలని..అందెశ్రీ కాల్ రికార్డింగ్స్ విడుదల చేస్తారా అని సవాల్ విసిరారు బెల్లయ్య నాయక్. దేశపతి లాంటి వాళ్లు మాట్లాడుతుంటే తెలంగాణ సమాజం సిగ్గు పడుతోందని చెప్పారు. అమెరికాలో పెట్రోల్ బంక్ లో పని చేస్తూ, నాన్న కేసీఆర్ తన మీద కుట్ర పన్నుతున్నారని ఉద్యమ సమయంలో మాట్లాడిన కేటీఆర్.. ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు. సమ్మక్క సారక్కలను చంపింది కాకతీయ రాజులేనని అన్నారు. కాకతీయుల చిహ్నాన్ని 12శాతం రిజర్వేషన్లు ఉన్నవాళ్లు ఎందుకు యాక్సెప్ట్ చేయాలని ప్రశ్నించారు.

Tags

Next Story