TS : ఖమ్మం ఎంపీ టికెట్ వీహెచ్‌కు ఇస్తే గెలిపించుకుంటాం : భట్టి విక్రమార్క

తనకు ఖమ్మం ఎంపీ సీటు రాకుండా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై భట్టి స్పందించారు. ‘లోక్ సభ అభ్యర్థుల ఎంపికలో అధిష్ఠానానిదే తుది నిర్ణయం. నేను అడ్డుకుంటున్నానని అనడం అపోహ మాత్రమే. ఖమ్మం ఎంపీ టికెట్ వీహెచ్‌కు ఇస్తే అందరం కలిసి ఆయనను గెలిపించుకుంటాం’ అని తెలిపారు.
అంతకుముందు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో తనకు టికెట్ రాకుండా తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ధ్వజమెత్తారు. భట్టి విక్రమార్క తనకు ద్రోహం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఖమ్మం టికెట్ తనకు రాకుండా భట్టి ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థంకావడం లేదని అన్నారు. మొదట ఆ స్థానం నుంచి తనకే అవకాశం ఇస్తానని ఒప్పుకున్నారని, కానీ ఇప్పుడు ఎన్నికలు సమీపించే వేళ తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com