TS : దానంను వదలని భూకబ్జా కేసు

ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన దానం నాగేందర్.. ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి బరిలో దిగారు. ఐతే.. ఆయనను భూకబ్జా కేసులు మాత్రం వదలడం లేదు.
దానం నాగేందర్ భూకబ్జా చేశారంటూ మరోసారి ఫిర్యాదు చేశారు బాధితులు. బంజారాహిల్స్‌లోని తన ఇంటి వెనక రోడ్డు స్థలాన్ని ఆక్రమించారని దానం నాగేందర్ పై ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కబ్జాలపై దానంను వదిలిపెట్టేది లేదని కేటీఆర్ హెచ్చరించారు.
ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాతే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన ఇంటి వెనక రోడ్డు స్థలాన్ని ఆక్రమించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. సీఎం రేవంత్ దీనికి వంత పాడుతున్నారనేది కేటీఆర్ చేసిన ఓ ప్రధాన ఆరోపణ. ఇటీవలే ఆ స్థలంలోని బ్లూ షీట్లను తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకుంది షేక్‌పేట మండల రెవెన్యూ సిబ్బంది. అధికారులు ఆక్రమణలను తొలగించినా మళ్లీ బ్లూ షీట్లు ఏర్పాటు చేశారు దానం నాగేందర్. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు దీనిపై కేసు పెట్టారు. దానం ఎలా రియాక్టవుతారో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com