TS : కేటీఆర్‌ను విమర్శించినవారి ఫోన్లను ట్యాప్ చేశాం: భుజంగరావు
పేపర్ లీకేజీపై కేటీఆర్‌ను విమర్శించినవారి ఫోన్లను కూడా ట్యాప్ చేశామని తన వాంగ్మూలంలో అప్పటి ఇంటెలిజెన్స్ ASP భుజంగరావు వెల్లడించారు. కామారెడ్డి అసెంబ్లీ ఎన్నిక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డిపై నిఘా పెట్టామని భుజంగరావు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లను ట్యాప్ చేశామని సస్పెండైన ఇంటెలిజెన్స్ భుజంగరావు వాంగ్మూలం ఇచ్చారు. ‘విపక్ష, విద్యార్థి నేతలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశాం. వారి వాహనాలను ట్రాక్ చేశాం. GHMC, మూడు ఉపఎన్నికల సమయంలో, మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్ మద్దతుదారుల ఫోన్లను ట్యాప్ చేశాం. ఇదంతా మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, ఎస్‌వోటీ, టాస్క్‌ఫోర్స్ సాయంతోనే చేశాం’ అని ఆయన వెల్లడించారు.
ఆర్ఎస్‌ను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని భుజంగరావు వాంగ్మూలం ఇచ్చారు. బీఆర్ఎస్ నేతల సూచనలతో సెటిల్‌మెంట్లు చేశాం. 2 ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి భారీగా డబ్బు తరలించాం. టాస్క్‌ఫోర్స్ వాహనాల్లోనే డబ్బు తీసుకెళ్లాం. రియల్టర్ సంధ్యాశ్రీధర్ రావు రూ.13కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్స్ కొనేలా చేశాం. మాట వినకపోతే కేసులతో ఇబ్బంది పెడతామని హెచ్చరించాం’ అని వివరించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com