Breaking News : బిగ్ బ్రేకింగ్ .. కవితకు బిగ్ షాక్ .. 7 రోజులు కస్టడీలోకి

Breaking News :  బిగ్ బ్రేకింగ్ .. కవితకు బిగ్ షాక్ ..  7 రోజులు కస్టడీలోకి
X

ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (BRS MLC Kavitha) బిగ్ షాక్ తగిలింది. రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు కస్టడీ విధించింది. ఈడీ అధికారుల వినతి మేరకు కవితను 7 రోజులు కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టనుంది. బీజేపీ రాజకీయ దురుద్దేశంతోనే తమ ఎమ్మెల్సీని అరెస్టు చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైరయ్యారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ ధర్నాల్లో పార్టీ కార్యకర్తలతో పాటు మహిళా సంఘాలు, మహిళలు భాగమయ్యేలా బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది.

Tags

Next Story