BRS MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్

ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ను రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కవితపై దాఖలైన చార్జి షీట్ ను రౌస్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుంది. అలాగే జూన్ 3న చార్జిషీట్ లో పేర్కొన్న నిందితులందరూ కోర్టు ఎందటు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. దీంతో వచ్చే నెల 3న కవితను జైలు అధికారులు కోర్టులో ప్రవేశపెటట్నున్నారు.
కాగా ఈడీ, సీబీఐ కేర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా తన వద్ద విచారణకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని ఈడీ చేసిన వాదనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఉత్తర్వులను రిజర్వ్ చేశారు. తాజాగా ఇవాళ ఈడీ చార్జిషీట్ ను పరిగణలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
మరో వైపు కవిత బెయిల్ పిటిషన్లపై నిన్న ఢిల్లీ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్డు జడ్జి స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వు చేశారు. ఈ క్రమంలో రౌస్ అవెన్యూ కోర్టు మాత్రం ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్ ను పరిగణలోకి తీసుకుని ఇందులో నిందితులుగా ఉన్న వారందరిని విచారణకు పిలవడం హాట్ టాపిక్ గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com