TS : తెలంగాణలో బీజేపీ టార్గెట్ డబుల్ డిజిట్

TS : తెలంగాణలో బీజేపీ టార్గెట్ డబుల్ డిజిట్

బీఆర్‌ఎస్‌కు తెలంగాణలో తగ్గుతున్న ఆదరణను ఓట్ చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. తెలంగాణలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రెండంకెల సీట్లు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. భారతీయ జనతా పార్టీ 2014లో ఒక సీటు, 2019లో నాలుగు సీట్లు గెలుచుకుంది. ఈసారి అంతకు మించి సాధించాలనేదే బీజేపీ టార్గెట్. ముఖ్యంగా 10 సీట్లు సాధించాలని పట్టుదలతో ఉంది బీజేపీ.

మోడీ గ్రాఫ్ అంతటా పెరగడం.. బీఆర్‌ఎస్ గ్రాఫ్ క్షీణించడం.. కాంగ్రెస్ కు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నంత వేవ్ దేశ రాజకీయాల్లో లేకపోవడం తమకు ప్లస్ అవుతుందని బీజేపీ భావిస్తోంది. తెలంగాణలో ఈసారి టెన్ ప్లస్ సీట్లు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బ్యాక్ టు బ్యాక్ తెలంగాణలో పర్యటించబోతున్నారు. ప్రధాని మోదీ మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలో పర్యటించి ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో బహిరంగ సభల్లో ప్రసంగించారు. మార్చి 12న హైదరాబాద్‌కు వచ్చిన అమిత్‌ షా.. పోలింగ్‌ బూత్‌ కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ తో సంభాషించారు. మార్చి 15న మల్కాజిగిరి, మార్చి 16న నాగర్‌కర్నూల్‌, మార్చి 18న జగిత్యాలలో రోడ్‌షోలు నిర్వహించి బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు ప్రధాని మోదీ. జి కిషన్ రెడ్డి (సికింద్రాబాద్), ఈటల రాజేందర్ (మల్కాజిగిరి), మాధవి లత (హైదరాబాద్), బూర నర్సయ్య గౌడ్ (భువనగిరి), రంజిత్ రెడ్డి (చేవెళ్ల), బండి సంజయ్ (కరీంనగర్), ధర్మపురి అరవింద్ (నిజామాబాద్), బీబీ పాటిల్ (జహీరాబాద్), రఘునందన్ రావు(మెదక్), డీకే అరుణ(మహబూబ్ నగర్) సీట్లు గెలుస్తామన్న ధీమాతో ఉంది బీజేపీ.

Tags

Read MoreRead Less
Next Story