BJP : ఆరుగురు అభ్యర్థులతో బీజేపీ ఫస్ట్ లిస్ట్

BJP : ఆరుగురు అభ్యర్థులతో బీజేపీ ఫస్ట్ లిస్ట్

పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదల చేయనుంది. మొత్తం ఆరు మందిలో ఈ మొదటి జాబితాను సిద్ధం చేశారు. ప్రస్తుతం ఉన్న నలుగురు సిట్టింగ్ ఎంపీల్లో ముగ్గురికి మళ్లీ సీట్లు ఖరారయ్యాయి. మరో సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు పేరును బీజేపీ అధిష్టా నం తొలి జాబితాలో ప్రకటించలేదు. సిద్ధం చేసిన ఆరుగురు అభ్యర్థుల్లో కిషన్ రెడ్డి. బండి సంజయ్. ధర్మపురి అరవింద్ ముగ్గురికి మళ్లీ వారి సిట్టింగ్ స్థానాలనే బీజేపీ హై కమాండ్ కేటాయించింది.

కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి, బండి సంజయ్. కరీంనగర్ నుంచి, ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీలుగా బరిలో దిగనున్నారు. వారితో పాటుగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్ల నుంచి, డాక్టర్ వెంకటేశ్వరరావు ఖమ్మం నుంచి, బూర నర్సయ్య గౌడ్ భువనగిరి నుంచి బీజేపీ అభ్యర్థులుగా ఖరారయ్యారు. వీరితోపాటు ఆదిలాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణకు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ సెగ్మెంట్ లో ఈటలకు మురళీధర్ రావుకు నడుమ తీవ్ర పోటీ నెలకొని ఉంది. లోకల్ బీజేపీ నాయకత్వం మురళీధర్ కు మద్దత్తు తెలుపుతున్నారు. అయితే బీసీ కార్డు ప్రయోగిస్తున్న ఈటెల వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపుతుందాలేదా అన్నది ఇంకా సస్పెన్ గానే వున్నది. మొత్తం 17 లోక్సభ స్థానా లో 16 స్థానాలు గెలువాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా గెలుపుగుర్రాలకే టికెట్లు ఇవ్వా లని నిర్ణయించింది. ఆ మేరకు ఇవాళ ఆరు గురు అభ్య ర్థులతో తొలి జాబితాను వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story