TS : 'గాడిద గుడ్డు'కు బీజేపీ కౌంటర్ క్యాంపెయిన్

TS : గాడిద గుడ్డుకు బీజేపీ కౌంటర్ క్యాంపెయిన్

తెలంగాణ ఎన్నికల్లో పోటాపోటీ డ్యామేజ్ ప్రమోషన్ జరుగుతోంది. తెలంగాణకు మోడీ గాడిదగుడ్డు ఇచ్చారని రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారానికి బీజేపీ కౌంటర్ ప్రచారం మొదలుపెట్టింది. గ్యారంటీలన్నీ గాడిద గుడ్లేనని సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టింది.

రేవంత్ రెడ్డి ఇటీవల బీజేపీ ఇచ్చింది 'గాడిద గుడ్డు' అంటూ ప్రత్యేకంగా ప్రచార సభల్లో హోరెత్తిస్తున్నారు. '6 గ్యారంటీలతో ధోకా.. కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు ఇచ్చింది గాడిద గుడ్డు' అని కౌంటర్ ఇచ్చింది బీజేపీ. రూ.2లక్షల రైతు రుణమాఫీ ఒకటవ గుడ్డు అని, వరికి రూ.500 బోనస్ రెండవ గుడ్డు అని సెటైర్లు వేసింది.

కౌలు రైతులకు రూ.15వేల రైతుభరోసా మూడవ గుడ్డు అని.. రైతు కూలీలకు రూ.12 వేల సహాయం పేరిట 4 వగుడ్డు ఇచ్చిందని ఎద్దేవా చేసింది. విద్యార్థులకు రూ.5లక్షల హామీతో 5వ గుడ్డు, నిరుద్యోగులకు నెలకు రూ.4వేల హామీతో 6 గుడ్లు ఇచ్చిందని మండిపడింది. మహిళలకు రూ.2,500 పేరిట 7 వ గుడ్డు ఇచ్చిందని పంచ్‌లు వేసింది. ప్రస్తుతం కాంగ్రెస్‌పై బీజేపీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాషాయ దళం దీనిని రీట్వీట్ చేస్తూ వైరల్ చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story