TS : దానం నాగేందర్‌ను డిస్ క్వాలిఫై చేయాలంటూ స్పీకర్‌కు బీఆర్ఎస్ విన్నపం

TS : దానం నాగేందర్‌ను డిస్ క్వాలిఫై చేయాలంటూ స్పీకర్‌కు బీఆర్ఎస్ విన్నపం

తెలంగాణ (Telangana) రాజకీయం గేమ్ చేంజర్ లా సస్పెన్స్ థ్రిల్లర్ లా సాగుతున్నాయి. గేట్లు ఎత్తామన్న రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నంత పనిచేస్తున్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదివారం కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరడాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోంది.

కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. శాసన సభ స్పీకర్ ను ఆయన నివాసంలో కలిసి పిటిషన్ ను సమర్పించారు బీఆర్ఎస్ శాసన సభా పక్ష బృందం. దానం నాగేందర్‌ను డిస్‌క్వాలిఫై చేయాలని స్పీకర్‌కు పిటీషన్ ఇచ్చామని.. పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం అని స్పీకర్ చెప్పారన్నారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చాంపాలన్న రేవంత్‌రెడ్డి, ఇప్పుడేం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. బీడీలు అమ్మే దానం నాగేందర్‌ను ఎంతకు కొన్నారో రేవంత్ చెప్పాలనీ.. సుప్రీంకోర్టు జడ్జ్‌మెంట్ ప్రకారం 3 నెలల్లోనే దానంపై అనర్హత వేటు పడుతుందన్నారు. రేవంత్ కొడితే మేము తీసుకున్నాం‌మనీ.. మేము కొట్టినప్పుడు రేవంత్ ఇగ లేవడని సవాల్ చేశారు. సింహం ఒకడుగు వెనకకు వేసిందంతే అంటూ కౌశిక్ రెడ్డి చెప్పడం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story