TS : తెలంగాణ చిహ్నంపై రఘునందన్ ఫైర్

TS : తెలంగాణ చిహ్నంపై రఘునందన్ ఫైర్
X

రాష్ట్ర చిహ్నం మార్పుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ నేత రఘునందన్ రావు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం.. చార్మినార్ చిహ్నం అంటే మీకెందుకంత చిరాకు అని ప్రశ్నించారు.

అవి రాచరికపు గుర్తులు కాదు..వెయ్యేళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు అన్నారు. వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలని గుర్తు చేశారు. కాకతీయ తోరణం, చార్మినార్ గురించి అధికారిక గీతంలో కీర్తించి, అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా.. అని ఫైర్ అయ్యారు.

తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి.. వీటిని తొలగించడం అంటే.. తెలంగాణ చరిత్రను చెరిపేయడమే.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమే అన్నారు రఘునందన్ రావు.

Tags

Next Story