TS : ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తనను హత్య చేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, కాల్స్ నెంబర్లను కాల్ లిస్ట్ స్క్రీన్ షాట్ ను కూడా ఆయన పంచుకునన్నారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. . ప్రధాని మోదీ, పీఎంవో ఇండియా, అమిత్ షా, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సిటీ పోలీస్, తెలంగాణ సీఎంవోలను ఆయన ట్యాగ్ చేశారు.
తనకు ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం తొలిసారి కాదన్న రాజాసింగ్.. గతంలో వీటిపై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. అయినప్పటికీ, బాధ్యతాయుతమైన పౌరుడిగా తనకెదురైన ఈ పరిస్థితిని పోలీసు శాఖకు తెలియజేస్తున్నా అని పేర్కొంటూ ఆ మొబైల్ నంబర్స్‌ను పంచుకున్నారు. గతంలో కూడా రాజాసింగ్ కు చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీనిపై ఆయన పలు మార్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com