High Court : బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట

కరీంనగర్ (Karimnagar) బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కు (Bandi Sanjay) హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 11 వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ చేయాల్సి వస్తే సీఆర్‌పీసీ 41 నోటీసు ఇవ్వాలని స్పష్టం చేసింది. గత నెల 27న సంజయ్‌పై ఉప్పల్, మేడిపల్లి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ వేసిన క్వాష్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.
కాగా ఈ నెల 27న చెంగిచర్లలో హిందూ, ముస్లిం వర్గాల మధ్య జరిగిన గొడవలో గాయపడిన వారిని పరామర్శించేందుకు సంజయ్ వెళ్లగా పోలీసులు అనుమతించలేదు. ఆ సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై కేసు నమోదైంది.
గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళ్తుంటే పోలీసులు అక్రమ కేసులు బనాయించారని సంజయ్ తరఫు న్యాయవాది వాదించారు. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈనెల 11కి వాయిదా వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com