TS : ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి నామినేషన్

TS : ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి నామినేషన్

వరంగల్, ఖమ్మ,నల్గొండ పట్టభధ్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. నల్లగొండలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు ఈ బిజెపి అభ్యర్థి.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు బిజెపి రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. బేగంపేట్ విమానాశ్రయం నుండి హెలికాప్టర్ లో నల్లగొండ బయలు దేరారు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్.

వరంగల్‌ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం ఈరోజుతో ముగియనుంది. శుక్రవారం నుంచి నామినేషన్ల పరిశీలన ప్రారంభం కానున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ నెల 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నట్లు వెల్లడించారు.

బుధవారం రోజున మరో 12 మంది అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారని.. దీంతో నామినేషన్లు వేసిన వారి సంఖ్య 41కి చేరినట్లు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story