TS : మల్కాజిగిరిలో ఈటలదే గెలుపు!

రాబోయే లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన పబ్లిక్ ఒపీనియన్ పోల్స్ విడుదలవుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద లోక్సభ స్థానం అయిన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజవర్గంపై అందరి దృష్టి ఉంది. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే, ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కే ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు సర్వేలో తేలింది.
జన్ లోక్ పోల్ సర్వే- 2024 ఆసక్తికర విషయాలు వెల్లడించింది. మల్కాజిగిరిలో పార్లమెంట్ స్థానంలో బీజేపీ - 37.38%, కాంగ్రెస్- 35.38%, బీఆర్ఎస్- 24.93%, ఇతరులు- 2.50% ఓట్లు పొందే అవకాశం ఉందని సర్వే తెలిపింది. ఎంపీ రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఈ సెగ్మెంట్ లో ఇపుడు బీజేపీ వేవ్ కనిపిస్తోంది. దీంతో.. ప్రధాని మోడీ సైతం మల్కాజిగిరిలో ఎన్నికల ప్రచారం
నిర్వహించనున్నారు.
మార్చి 15న శుక్రవారం సాయంత్రం మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి వరకు 1.3 కిలోమీటర్ల రోడ్ షోలో మోడీ పాల్గొంటారు. ఈ రోడ్ షో ఈటలకు మరింత ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ఇక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును బరిలోకి దింపగా, కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com