TS : జూన్ 2 వేడుకలపై బీజేపీ కీలక ప్రకటన

TS : జూన్ 2 వేడుకలపై బీజేపీ కీలక ప్రకటన
X

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని బిజెపి జిల్లా, మండల కేంద్రంలలో మరియు అన్ని ప్రాంతాలలో జాతీయ జెండాలను ఎగురవేసి ఘనంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. ఈ కార్యక్రమాలలో అందరూ పాల్గొనాలని కోరుతున్నామని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు తెలిపారు.

పార్టీ ఇచ్చిన ప్రకటన ప్రకటనలో ఈ అంశాలను పేర్కొన్నారు. "తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో భారతీయ జనతా పార్టీ పాత్ర ప్రముఖమైనది. భారతీయ జనతా పార్టీ సహకారంతోనే పార్లమెంటులో బిల్లు పాస్ అయిన విషయం విధితమే. తెలంగాణ ఉద్యమ పోరాటంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందున్నారు. అనేక కార్యక్రమాలలో తెలంగాణ ఉద్యమానికి సంఘీభావం తెలియజేసి ఉద్యమంలో ఉధృతంగా భారతీయ జనతా పార్టీ పాల్గొన్నది. గ్రామస్థాయి నాయకుల, కార్యకర్తల నుండి జాతీయ స్థాయి నాయకుల వరకు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను సన్మానించడం.. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన, ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబా లను కలవడం స్మరించుకోవడం తదితర కార్యక్రమాలను నిర్వహించాల్సిందిగా రాష్ట్ర బిజెపి కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కోరుతున్నది.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం హైదరాబాద్ లో రేపు ఉదయం 9 గంటలకు బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యులు, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఈ కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర, నగర నాయకులు పాల్గొంటారు" అని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు తెలిపారు.

Tags

Next Story