BJP : బీజేపీ సరికొత్త ఎత్తుగడ.. చెంగిచెర్ల

BJP : బీజేపీ సరికొత్త ఎత్తుగడ.. చెంగిచెర్ల

ప్రగతి, హిందూత్వ అజెండాతో బీజేపీ ఎన్నికలకు వెళ్తోంది. మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణను హైలైట్ చేస్తోంది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో వెంటనే బీజేపీ నేతలు స్పందించారు. అది హిందూ ముస్లిం గొడవ ..అని.. ఒక్క చెంగిచెర్ల ఇష్యూ కాదని.. రాష్ట్రం మొత్తం ఇష్యూ అని ఒకరి తర్వాత ఒకరు పరామర్శలు ప్రారంభించారు. మొదట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధితులను పరామర్శించారు.

హిందువులపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు కిషన్ రెడ్డి. తర్వాత బండి సంజయ్ బుధవారం పిలుపునిచ్చి మరీ చెంగిచెర్ల వెళ్లారు. బండి పిలుపుతో.. పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, హిందూ సంఘాల నేతలు రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాసేపు అక్కడి వాతావరణం రణరంగంగా మారింది. బీజేపీ కోరుకున్నట్లుగా స్టేట్ పొలిటికల్ ఇష్యూగా మారింది. బండి సంజయ్ తమ విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు కేసులు పెట్టారు. ఈ వివాదానికి కొనసాగింపుగా రాజాసింగ్ అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఇది కూడా అధికార కాంగ్రెస్ పై ఒత్తిడి తెచ్చింది.

బీజేపీకి ఇలాంటి అవకాశాలు ఎన్నికల టైంలో దొరికితే వదిలిపెట్టదు. ఎన్నికల అంశంగా మార్చుకున్నా ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ విషయంలో బీజేపీ కార్నర్ చేయడానికి హిందూ, ముస్లిం అంశాలను ఎప్పుడూ ముందుకు తెస్తుంది. ఈ దాడిని కాంగ్రెస్ ఎలా తిప్పికొడుతుందో చూడాలి.

Tags

Next Story