Begumpet Airport : బేగంపేట్ ఎయిర్ పోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు

Begumpet Airport : బేగంపేట్ ఎయిర్ పోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు
X

హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి ( Begumpet Airport ) వరుస బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. బేగంపేట ఎయిర్ పోర్టుకు సోమవారం ఉదయం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. సదరు మెయిల్లో విమానాశ్రయంలో బాంబు ఉందని హెచ్చరించారు.

అలర్ట్ అయిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. ఎయిర్పోర్ట్ సహా పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా బాంబు లేదని గుర్తించారు. అనంతరం, సదరు మెయిల్ ఎవరు పంపారనే విషయంపై దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఇటీవలి కాలంలో దేశంలోని పలు విమానాశ్రాయలకు కూడా ఇలాగే బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ వరుసగా వస్తున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. తని భీల్లో బాంబు లేదని తెలిసి అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

బాంబు బెదిరింపు పేరిట వచ్చే ఫేక్ కాల్స్ చేసేవారిపై, మెయిల్స్ పంపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Tags

Next Story