TS : నేడు కాంగ్రెస్ లోకి బొంతు రామ్మోహన్

జీహెచ్ఎంసీ (GHMC) మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ (Bontu Rammohan) బీఆర్ఎస్ (BRS) ను వీడి నేడు కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరనున్నారు. గాంధీభవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. విద్యార్థి నేతగా ఉన్నప్పటి నుంచి, ఉద్యమ సమయంలోనూ కీలకపాత్ర పోషించిన, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ కు అత్యంత సన్నిహితునిగా మెలిగిన రామ్మోహన్ ఇటీవల సీఎం రేవంత్ ను ఆయన నివాసంలో కలవడం తెలిసిందే. సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి ఎంపీ టికెట్లలో ఏదో ఒకటి కావాలని ఆయన కోరినప్పటికీ, బీఆర్ఎస్ అధిష్టానం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో ఆయన కాంగ్రెస్ బాట పట్టారు. శుక్రవారం పట్నం సునీతా మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు మోతె శోభన్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com