KTR : బ్రెయిన్ డైన్ దేశానికి పెను సవాల్ : మాజీ మంత్రి కేటీఆర్

KTR : బ్రెయిన్ డైన్ దేశానికి పెను సవాల్ : మాజీ మంత్రి కేటీఆర్
X

మేధోవలస (బ్రెయిన్ డ్రైన్) మన దేశానికి పెను సవాలుగా మారిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దేశాభివృద్ధిలో, తెలంగాణ అభివృద్ధిలో విదేశాల్లో చదువుకుంటున్న యువత భాగం కావాలని పిలుపునిచ్చారు. అమెరికాలో వివిధ కారణాలతో ఇబ్బందులు పడే తెలుగు విద్యార్థులకు అండగా నిలబడతామని చెప్పారు. ఎన్నో ఆశలతో ఉన్నత విద్య కోసం వచ్చిన విద్యార్థులు, గ్రేడ్ల కోసమో కాకుండా జీవితంలో అవగాహన లేక ఏమైనా తప్పు చేస్తే వారికి అవసరమైన న్యాయసహాయం అందించేందుకు బీఆర్ఎస్ అమెరికా విభాగం తరపున ప్రయత్నం చేస్తామన్నారు. స్థానిక చట్టాలతో పాటు ఇక్కడి పరిస్థితులను ప్రతీ ఒక్క విద్యా ర్థి అవగాహన చేసుకోవాలన్నారు. ఇవాళ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్ లో చదువుకుంటున్న విద్యార్థులతో కేటీఆర్ మాట్లాడారు. కేవలం ర్యాంకుల కోసమో, సాధించాల్సిన ప్రధాన లక్ష్యాలపై దృష్టి పెట్టాలన్నారు. ఎన్ని అవరోధా లు ఎదురైనా, మనతోనే ఉన్న వ్యక్తులు వెనక్కి లాగినా నిబద్ధతతో ముందుకు పోవాలన్నారు. ఇన్నోవేషన్ రంగంలో ప్రపంచ దేశాలతో ఇండియా పోటీపడి రాణించాల్సిన అవసరం ఉందన్నారు. రిస్కు తీసుకున్నప్పుడు మాత్రమే కలలు సాకారం అవుతాయి అనడానికి కేసీఆర్ జీవితమే సాక్ష్య మన్నారు.

Tags

Next Story